” ఎన్ఎస్వీలో “ఘనంగా సంక్రాంతి సంబరాలు

 

జగిత్యాల, జనవరి 12: ఆర్కే గ్రూప్ విద్యాసంస్థలలో ఒకటైన ఎన్ ఎస్వీ జూనియర్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సంక్రాంతి వేడుకను పురస్కరించుకుని ఆ కళాశాల విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎందరో విద్యార్థినులు ఉత్సహంతో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన ప్రధమ బహుమతి విజయ, సమిత, ద్వితీయ బహుమతి మహాలక్ష్మి, రేహ తృతీయ బహుమతి మానస, ధరణి లకు అందజేశారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపల్ పల్లెర్ల నరేష్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ సంప్రదాయాలు, ఆచారాలను ఆచరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి పండుగను విద్యార్థులతో పంచుకోవడం మా ధర్మమని అందులో భాగంగానే సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే, ఎన్ఎస్వీ విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సీపల్ కొక్కుల రాజేందర్ తోపాటు అధ్యాపక బృందం, విద్యార్థినులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking