ప్రజా పాలనలో పథకాలు ప్రజలకు అందాలి

ఆరు గ్యారెంటీలు అందరికీ దక్కెల చూడాలి

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు :
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 26:

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ ప్రాణాలిక బద్దంగా జరగలని తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కొండ సురేఖ, సీతక్క లు అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పథకాలపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నరూ. మంత్రులకు వరగ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు శాంతి భద్రతల గురించి సిపి అంబర్ కిషోర్ జా మంత్రులకు తెలియజేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 66 డివిజన్లో స్థితిగతుల పైన కమిషనర్ రిజ్వాన్ షేక్ బాషా తెలియజేశారు అనంతరం మంత్రులు మాట్లాడుతూ వరంగల్ జిల్లా అధికారులు ఐక్యంగా అంకితభావంతో ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు.ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలనీ సూచించారు.
ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలనీ ,దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకొని
ప్రతి దరఖాస్తును స్వీకరించాలనీ అన్నారు.
ప్రతి దరఖాస్తు దారునికి 5 నిమిషాల నుండి 10 నిమిషాలు కేటాయించాలనీ,ప్రజా పాలన కార్యక్రమం లో అధికారులు , ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనదనీ అన్నారు.అధికారులు బాధ్యతయితంగా పని చేయాలనీ, జిరాక్స్ సెంటర్ లలో కూడా ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చూడాలనీ తగిన్నన్ని కౌంటర్లు , ఏర్పాటుచేయాలనీ.బాధ్యతాయుతమైన అధికారి చే రశీదు అందజేయాలనీ అన్నారు.అనంతరం ప్రతి ధరకాస్తు వివరాలు కంప్యూటర్ లో నమోదు చేయాలనీ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వంప్రజా పాలన పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేయడం జరుగుతుందనీ అన్నారు.
అర్హులైన వారు ఎవరు మిస్ కావద్దనీ,దీనికితోడుగా ఇతర దరకాస్తులను కూడా స్వీకరించాలనీ,ప్రతి దరకాస్తుకు సీరియల్ నంబర్ వేయాలనీ తెలిపారు.ప్రభుత్వానికి కళ్ళు చెవులు ప్రభుత్వ అధికారులేఅని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చిత్తశుద్ధితో అమలు అయ్యేలా కృషి చేయాలనీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పథకాలను పక్కాగా అమలు చేయాలని కోరుతున్నాంమని సమన్వయంతో ప్రజా పాలనను విజయవంతం చేయాలని మంత్రి సురేఖ అధికారులతో అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking