ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 09 :
– పాఠశాల భవనం 15 రోజుల్లో పూర్తికవడం కోసం పని చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ షాభరిష్ గారిని పోలీస్ అధికారులను అభినందించిన మంత్రి వర్యులు సీతక్క గారు
– తక్కళ్ళ పాడు గూడెం లో పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ రోజు తాడ్వాయి మండలం తక్కళ్ల పాడు గోత్తి కోయ గూడెం గ్రామానికి చెందిన పునేం తులసి జూన్ 2 న డ్రామా జూనియర్స్ లో పాల్గొనగా అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క గారు పునేం తులసి అద్భుతమైన ప్రతిభ కనబరిచిన తులసి అక్కున చేర్చుకుని అభినందించగా అదే కార్యక్రమములో మా ఊరిలో పాఠశాల భవనం లేదు మేము చదువుకోవాలి అని మంత్రి గారిని తులసి కోరగా 15 రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్ గారి సహకారం జిల్లా ఎస్పీ గారి చొరువ తో డాక్టర్ తరుణ్ రెడ్డి గారి కొంత ఆర్థిక సాయం తో పాఠశాల భవనం నిర్మించగా ఈ రోజు అట్టి భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా తక్కళ్ల పాడు గూడెం ప్రజలు మంత్రి సీతక్క గారికి ఘన స్వాగతం పలికి మంత్రి గారిని శాలువా తో సన్మానించారు పాఠశాల లో ఉన్న విద్యార్థులకు దుస్తులు పలకలు నాట్ పుస్తకాలు మంత్రి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.
అనంతరం మంత్రి గారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలకు విద్య వైద్యం అందుబాటులోకి తెచ్చే విధంగా నేను కృషి చేస్తానని తులసి కోరిక మేరకు ఇక్కడ పాఠశాల భవనం కట్టివ్వడం జరిగినది దీనిని గూడెం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని
ఈ పాఠశాల భవనం 15 రోజుల్లో పూర్తి చెయ్యడం కోసం అహర్నిశలు కృషి చేసిన పోలీస్
అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్య తోనే సమాజం పేదరికం నిర్మూలించవచ్చని ఇక్కడ మీ ముందు కూర్చున్న వారు ఎంత కష్టపడి ఈ స్థాయిలో ఉన్నారని కూడా పేద కుటుంబంలో ఒక రోజు తింటే రెండు రోజులు పస్తుల ఉన్న రోజులు ఉన్నాయని గుర్తి చేశారు.పేదరికం అనేది మన బలహీనత అనుకోకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి గూడల్లో పాఠశాల భావనలను కట్టించే విధంగా కృషి చేస్తానని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ షభరిష్ గారి ఆధ్వర్యములో మంత్రి సీతక్క గారి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలుపడం జరిగింది.అదే విధంగా తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో కేక్ కట్ మంత్రి వర్యులు సీతక్క గారికి శుభా కాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు,OSD గారు,డీఎస్పీ గారి తో పాటు పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.