జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన లక్షెట్టిపేట గురుకుల విద్యార్థినులకు ఘణ స్వాగతం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21 : జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట గురుకుల విద్యార్థినులకు గురువారం ఘనస్వాగతం పలికారు, పాఠశాల,కళాశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించినటువంటి 67వ రాష్ట్ర స్థాయి బాలబాలికల కుస్తీ పోటీలలో లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు చెందిన క్రీడాకారిణులు పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ఎం లలిత కుమారి మేడం ఒక ప్రకటనలో తెలిపారు. సిహెచ్.సహస్ర 76 కేజీల విభాగంలో బంగారు పతకం,డి శాలిని 62 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైనట్లు పిడిపిఈటి మల్లిక మమత తెలిపారు.వీరిని పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికి అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వరరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ మౌనిక రమాదేవి,ప్రజ్ఞ,స్వప్న ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించడం జరిగింది.అంతేకాకుండా ఈ క్రీడాకారిణి లను డి ఐ ఈ ఓ శైలజఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎస్ జీ ఎఫ్ కార్యదర్శి బాబురావు గురుకులాల కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్, అదిలాబాద్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ స్వరూప రాణి,స్పోర్ట్స్ ఆఫీసర్,డాక్టర్ రామ లక్ష్మణ్ అభినందించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking