ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 : ఈ నెల 16, 17, 18 తేదీలలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు తరఫున ఆడి,ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైన లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడాకారిణి ప్రజ్ఞను అభినందిస్తూ,శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో,వైస్ ప్రిన్సిపల్ మహేశ్వరరావు, పిడి,మల్లిక,కుమారి మమత, ఉమాదేవి,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ జి మౌనిక తదితరులు పాల్గొన్నారు.