రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 23 డిసెంబర్ 2023: 1950లో సేట్ శ్రీరామ్‌జీ గుప్తా వీధి ఆవులను సేకరించి నార్సింగి గ్రామంలోని తన సొంత వ్యవసాయ భూమి 68 ఎకరాలను గోసేవ కోసం విరాళంగా ఇవ్వడం జరిగినది, ఆవు ప్రేమికుల మద్దతుతో మాజీ చీఫ్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ్ గుప్తా 217 ఎకరాల భూమిని జోడించి 9 నవంబర్ 1970 న పబ్లిక్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ -1350 కింద 445/1970 నంబర్‌తో శ్రీకృష్ణ గోసేవా మండల్ ఏర్పాటు చేసినారు, దినదినాభివృద్ధితో ప్రస్తుతం దాదాపు 100 కుటుంబాలు గో సేవలో తరిస్తున్నారు వారికి చలి తీవ్రతను తట్టుకోవడానికి ధనుర్మాస శుక్ల వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీ ఆర్ ఫర్ యు సంస్థ ద్వారా రగ్గులను అందజేయడంతో పాటు వారి పిల్లలు తినడానికి బిస్కెట్స్ మరియు గోవులకు దాణా ఇవ్వడం జరిగినది.