రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 13 జూన్ 2024:
రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల్ లోనే చదువుల తల్లి సరస్వతీ దేవి కరుణా కటాక్షాలు పొందడంలో ప్రఖ్యాతి గాంచిన మణికొండ జిల్లా పరిషద్ హై స్కూల్ నుండి ఈ సంవత్సరం 176 మంది (86. 27 శాతం) విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణులు కాగా అందులో 18 మంది విద్యార్థులు 90 నుండి 100 కి 100 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయినారని వీ ఆర్ 4 సహాయోగ్ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు సంతోషంగా తెలియ పరుస్తూ అట్టి విద్యార్థులకు ట్రస్ట్ ద్వారా చిరు కానుకలతో కూడిన అభినందన మందారమాల దృవీకరణ పత్రాలు పెద్దలందరి ముందు జారీ చేయడానికి రాబోయే శనివారం 15-06-2024 న ఉదయం 11 గంటలకు మణికొండ జిల్లా పరిషద్ హై స్కూల్ ఆవరణలో ఇవ్వడానికి నిర్ణయించి నారని, ఈ శుభ సందర్భానికి ముఖ్య అతిథి దేవోభవగా మణికొండ మున్సిపల్ కమిషనర్ D.ప్రదీప్ కుమార్ విచ్చేస్తున్నారని, విశిష్ట అతిథి దేవోభవగా ‘థి సిటిజన్స్ కౌన్సిల్’ అధ్యక్షుడు ధూళిపాళ సీతారామ్ ను అహ్వానించామని తదుపరి గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరానికి గాను పూజా సింగ్, మహేశ్వరిల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు భరిస్తున్నామని ఇందులో భాగంగా కొంత మేర డాక్టర్ బోగా శ్రీనివాస్ ఆర్థిక సహాయాన్ని అందించారని మరియు ట్రస్ట్ కొనసాగిస్తున్న 9 చలి వేంద్రాలకు గాను ఆరింటి ఖర్చును మొత్తంగా బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి స్వంతంగా నిర్వహిస్తున్నారని మరియు విద్యార్థులకు వీ ఆర్ 4 సహాయోగ్ చారిటబుల్ ట్రస్ట్ అందజేసిన సాయంకాల సమయానికి తిను బండారాలను తమ వంతుగా కొన్ని రోజులు సరఫరా చేయడంలో అగ్రాగ్రమిగా యున్న గోల్డెన్ ఓరియల్ అపార్ట్మెంట్ వయోజన సభ్యులకు, స్కైలా గేటెడ్ కమ్యూనిటీ వయోజన సభ్యులకు, చలివేంద్రాలను కొనసాగించడానికి తమ వంతు నిర్వహణ సహకారాలందిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు నిరంజన్, సంగం శ్రీకాంత్, ఆలేటి రాజేందర్, క్లీన్ వాటర్, అఖిలేష్ తివారీ లందరికీ ప్రత్యేక ధన్యవాదాలతో పాటు ఉడుతా భక్తిగా సత్కరించు కోగలమని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ జేసినారు.