భక్తిశ్రద్ధలతో బిజిగిర్ షరీఫ్ గ్రామంలో షబేబరాత్ వేడుకలు.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 26

ముస్లింల పవిత్ర మాసమైన షాబాన్ సందర్భంగా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని జామే మస్జిద్ మరియు హజ్రత్ సయ్యద్ ఇంకుషావలీ రహమతుల్లాహ్ అలై దర్గాలో ఆదివారం రాత్రి భక్తి పారవశ్యంతో ముస్లిం సోదరులు షబేబరాత్ వేడుకలు జరుపుకున్నారు. షాబాన్ మాసంలో మృతి చెందిన తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామే మస్జిద్ లో మత గురువులు మౌలానా నౌమాన్ హష్మీ, మౌలానా యాసీన్, మరియు ఖాజా పాషా అల్లాహ్ సందేశాలను, ఖురాన్ లోని సూక్తులను వివరించారు. ప్రత్యేక నమాజు చదివించినారు. అనంతరం ముస్లిం సోదరులు అందరు కలిసి దర్గాలోని హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లాహ్ ఆలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలి రహమతుల్లాహ్ ఆలై, హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావలి రహమతుల్లాహ్ ఆలై, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలి రహమతుల్లాహ్ ఆలై సమాధులకు దర్శించుకునీ చాదర్లు సమర్పించారు. ముస్లిం సోదరులు రాత్రంతా జాగరము చేసినారు.ఈ వేడుకల్లో జమ్మికుంట మండలం మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్. అంకుషావలి, సయ్యద్ సమీర్, దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్,దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ కరీం,దర్గా కమిటీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌపిక్ హుస్సేన్, దర్గా కమిటీ కార్యదర్శి మహమ్మద్ జమాల్ అష్రఫ్, దర్గా కమిటీ కోశాధికారి మొహమ్మద్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking