కాంగ్రెస్ పార్టీ అధినేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి శాలువా తో సన్మానించి శుభా కాంక్షలు తెలిపిన సీతక్క
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా 26 జూన్ 2024 :
– కాంగ్రెస్ పార్టీ అధినేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిసి శాలువా తో సన్మానించి శుభా కాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
మంగళవారం రోజున ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ గారిని శాలువా తో సన్మానించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ల ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి వర్యులు సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనను కలిసి శుభా కాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి వర్యులు మాట్లాడుతూ ఈ దేశ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకై పేద ప్రజల పక్షాన పార్లమెంట్ లో తన గొంతును వినిపించి ప్రజలకు అండ దండగా రాహుల్ గాంధీ గారు ఉంటాడు అని పేదల కష్టాలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీ గారికి తోడుగా దేశ ప్రజలు ఉంటారు అని మంత్రి సీతక్క గారు అన్నారు