ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా

– క్యాంప్ కార్యాలయంలో ఎస్జీటియు క్యాలెండర్ ఆవిష్కరణ
– ఎస్జీటియు భవన నిర్మాణ స్థలం కు కృషి చేస్తా

-మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే
డా. మైనంపల్లి రోహిత్ .

మెదక్ జనవరి 5 ప్రజా బలం న్యూస్ :-

ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కారిస్తానని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎస్జీటియు ఉపాధ్యాయ సంఘం నూతన సంత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం, రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగా నరేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు విజ్ఞాపన పత్రాని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని ఆయన హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, జిల్లాలోని మండలాల బాధ్యులు సురేష్, సత్యం, రామక్రిష్ణ, రమేశ్, రేణుక, శ్రావణి, రాణిలతో పాటు మరికొంత మంది ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking