జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పాయింట్స్ పరిశీలించిన ఎస్పీ రాహుల్ హెగ్డే…

 

సూర్యాపేట, ప్రజాబలం ప్రతినిధి :

జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం సూర్యాపేట పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ పాయింట్లను పరిశీలించి ట్రాఫిక్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.పట్టణంలో పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ రద్దీ దృష్ట అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, రెగ్యులేషన్ చర్యలను చేపట్టాలని ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు.జిల్లా కేంద్రంలోని ఈనాడు కార్యాలయం జంక్షన్, పి ఎస్ ఆర్ సెంటర్, హెడ్ పోస్ట్ ఆఫీస్ చౌరస్తా, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా, పట్టణంలో ఇతర ముఖ్య కూడళ్లను పరిశీలించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజల అవసరాల దృష్ట్యా వాహనాల రద్దీ బాగా పెరుగుతుందని దానికి అనుగుణంగా పోలీసు చర్యలు చేపట్టాలని అన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, అధిక శబ్దాలు చేసే వాహనాల డ్రైవింగ్ పై కటినంగా వ్యవహరించాలి అని ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాహనాలు నడపాలని పార్కింగ్ చేసుకోవాలని కోరారు. షాపింగ్ ప్రాంతాలు, మార్కెట్ ప్రాంతాల్లో రద్దీ ని నియంత్రించి బాటసారులకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు. తోపూడుబండ్లు, పండ్లు, కూరగాయలు మొదలగు వ్యాపారులు ఫుట్ పాత్ లు దాటి రోడ్లపైకి రావద్దని కోరినారు.
ఎస్పీ వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పి నాగభూషణం ట్రాఫిక్ ఎస్ఐ నవీన్, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking