ఇంటర్లో వెనుక బడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి ,

మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా .

మెదక్ జనవరి 10 ప్రాజబలం న్యూస్:-

ఇంటర్ లో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలనీ ,
మెదక్ జిల్లా ను ఇంటర్ ఫలితాలు లో రాష్ట్రo లోనే మొదటి స్థానం లో ఉంచాలని ,జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంటర్ కాలేజ్ అధికారులను అదేశించారు.

స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో బుదవారం ఇంటర్ కళాశాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి,
సబ్జెక్ట్ కౌన్సిలర్స్ తయారు చేసిన ప్రత్యేక బేసిక్ లేర్నింగ్ మెటీరియల్ ను ఆవిష్కరించి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ,ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ కి అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలు దగ్గర గా ఉన్నాయని ,మెదక్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం లో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు 6,506 మంది ,రెండవ సం :లో పరీక్షలు రాసే విద్యార్థులు 6,653 మంది మొత్తం 13,159 మంది పరీక్షలకు హాజరవుతున్నారు అని అన్నారు.
విద్యార్థులు, తల్లితండ్రులు , అధ్యాపకులు సమిష్టిగా ఇంటర్ లో మంచి ఫలితల కోసం ప్రయత్నం చేయాలన్నారు.
విద్యార్థులు , ఫోన్ ఇతర సోషల్ మీడియా లకు దూరం గా ఉండి తల్లితండ్రుల కష్టానికి ఫలితం అందించాలన్నారు .

మెదక్ జిల్లా లో ఉన్న 63 ఇంటర్ కళాశాలలో విద్యార్థులను ABCD గ్రూప్ గా విభజించమని ,C,D గ్రూప్ విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
A,B,C,D గ్రూపు ల వారీగా విద్యార్థులను వాట్సప్ గ్రూప్ లు గా విభజించి నిరంతరం పర్యవేక్షిoచలన్నరు.

జనవరి 1 వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థుల లకు స్పెషల్ స్టడీ అవర్స్ ,
స్పెషల్ స్లీప్ టెస్ట్ లు నిర్వహిస్తున్నమన్నరు.
ఉదయం 5 గంటలకు విద్యార్థులను నిద్ర లేపి చదివించాలని పేర్కొన్నారు.

మెదక్ జిల్లా లో ప్రభుత్వ ,ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్ అందింస్తున్నమన్నారు.
చదువుల్లో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్దతీసుకోవాలన్నారు.
విద్యార్థులు పరీక్షల్లో ఉతిర్ణత కోసం, సబ్జెక్ట్ వారీగా, అర్హులైన ,అనుభవం గల సబ్జెక్ట్ నిపుణులు శ్రద్ద చూపాలన్నారు.
డ్రాప్ ఔట్ శాతం తగ్గించలా ని కళాశాల అధికారులకు దిశ నిర్దేశం చేశారు.

ఎస్సీ అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి మాట్లాడుతూ 2023-2024 విద్య సం :నికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలు కోసం ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న SC,ST ,BC & మైనార్టీ విద్యార్థులు 31 జనవరి 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు .
ఫ్రెష్ విద్యార్థులు కులము ,ఆదాయము ,బ్యాంక్ పాస్ బుక్ పుస్తకం , ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు , బోనాఫైడ్ సర్టిఫికేట్ , చదువుతున్న కోర్స్ కు సంబందించి ధృవ పాత్రలతో epass.cgg.gov.in వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు .
రెన్యూ వల్ విద్యార్థులు పాత దరఖాస్తు అప్లికేషన్ నంబర్ , జీరాక్స్ పాత్రలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
సంబంధిత కళాశాల యాజమాన్యం తమ కళాశాల యందలి అర్హత గల విద్యార్థుల అందరితో దరఖాస్తు చేయించి హార్డ్ కాపీలు సంబంధిత సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం కు పంపాలన్నారు.
ఉపకార వేతనాల లాగిన్ లు పెండింగ్ లో ఉన్నాయని ,లాగిన్ లను ప్రిన్సిపల్ లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు .
ఈ కార్యక్రమంలో
జిల్లా ఇంటర్ విద్యాధికారి సత్యనారాయణ, sc అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి, ప్రిన్సిపల్ కౌన్సిలర్స్ అవనిశ్ రెడ్డి ,శశిధర్ ,శ్రీనివాస్ గౌడ్ ,శ్రీదేవి,గీతా, నలంద కళాశాలల విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ పి.వి రమణ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking