నిర్మాణ పనులలో వేగం పెంచాలి

 

– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

-మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనుల పరిశీలన.

– నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి.
ములుప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 29 : గు జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు.

శనివారం మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులలో వేగం పెంచాలని అవసరమైతే అదనపు వర్కర్స్ తో పనులు చేయించాలని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ పనులు డిసెంబర్ మాసంలోపు పూర్తి చేసి అధికారులకు అందించాలని , నూతన కలెక్టరేట్ వచ్చే రహదారి కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

నూతనంగా మెడికల్ కళాశాల లో ఎన్ని కోర్స్ లు అందుబాటులో ఉంటాయి, ఎంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది , వారికి అందించే సదుపాయాలు ఎలా ఉంటాయి అనే తదితర అంశాలను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యపాల్ రెడ్డి , వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ లాల్ , ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్ ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking