జమ్మికుంటప్రజబలం ప్రతినిధి మే 27
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫార్మ్స్ కుట్టు కేంద్రాలను సోమవారం మెప్మా పిడి స్వరూప రాణి, కమీషనర్ మొహమ్మద్ అయాజ్, డిఎంసి శ్రీవాణి, ఏడిఎంసి మల్లీశ్వరిలు పరిశీలించారు. అనంతరం పలు కేంద్రాలను పరిశీలించి, యూనిఫార్మ్స్ నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం ఇచ్చిన సూచనలతో కుట్టాలని, యూనిఫార్మ్స్ కుట్టుట వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు సతీష్, సీఎల్ఆర్పీలు జ్యోతి, మంజుల, ఆర్పీలు, కుట్టు మిషన్ నిర్వాహుకురాలు అభేద భాను లతో పలువురు పాల్గొన్నారు.