వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి

 

-పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 9 :

వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు మందమర్రి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ గ్రౌండ్‌లో సోషల్ మీడియా వారియర్స్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత మహానేత కాక వెంకటస్వామి స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలోని ప్రతిభను వెలికి తీయడంలో పాటు సామాజిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దివంగత కాక వెంకటస్వామి స్మారకంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఆయన స్మృతులను గుర్తు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. క్రీడల్లో టీం స్పిరిట్, అనేది చాలా ముఖ్యమని ఓటమి గెలుపులను సమానంగా స్వీకరించాలని అన్నారు. కాక పేరు మీద టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ సొత్కు సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంద తిరుమలరెడ్డి, ఎం.డి ఇషాక్, ఎర్రరాజు, గట్ల సారంగపాణి, శివరామకృష్ణ, రంజిత్ శీను, సతీష్, మాయ తిరుపతి యాదవ్, రామసాని సురేందర్, శశిధర్, జావీద్, తుంగ పిండి విజయ్, వీరన్న, చోటు, అన్వేష్, రాజేష్, గణేష్, సూరజ్, అజయ్, సాత్విక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking