రాష్ట్ర ప్రభుత్వం విఫలం : బిజెపి నేత డా. ఎన్. గౌతమ్ రావు.

 

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు ఆధ్వర్యంలో నల్లకుంట చౌరస్తాలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సంధర్బంగా గౌతమ్ రావు మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను, రేషన్ కార్డులను పంపిణీ చెయ్యడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గౌతమ్ రావు దుయ్యబట్టారు. పేదలకు అన్యాయం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని గౌతమ్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా ఇంఛార్జ్ వెంకట్ రెడ్డి కార్పోరేటర్లు, పద్మ వెంకట్ రెడ్డి, ఉమా రమేష్ యాదవ్, అమృత , నాయకులు వనం రమేష్, వినోద్ యాదవ్, సూర్య ప్రకాష్ సింగ్ , ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్, రమేష్ యాదవ్, ప్రవీణ్ తదితరులు పాల్గోన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking