– వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 01 :

 

ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రములో అటవీ శాఖ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన
వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20.02 కోట్ల మొక్కలు నాటనున్నారు అని పురపాలక శాఖ పరిధిలో 10.09 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 6.37 కోట్లు, అటవీ శాఖ పరిధిలో 1.34 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది అని 1950లో కాంగ్రెస్ సర్కారు ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా నామకరణం చేశారు అని మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ వేడ్మ బొజ్జ తో పాటు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారితో పాటు అటవీ శాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking