75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ జాతీయ జెండాను ఎగరవేశారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి పోలీస్ కవాతులు స్వీకరించి, మహాత్మా గాంధీ, డా. అంబేద్కర్ ల ఫోటోలకు దండలు వేసి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి రఘునందన్ రావు, లింగంపల్లి నాగరాజు, జిల్లా అదనపు న్యాయమూర్తులు, మెజిస్టేట్లు, కార్యవర్గ సభ్యులు,సీనియర్ ,జూనియర్ న్యాయవాదులు , మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన న్యాయవాదులకు జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జిల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.