మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు.

 

మాదక ద్రవ్యాల వల్ల కలుగు నష్టాలపై అవగాహన కల్పించాలి.

గంజాయి సాగు, రవాణా జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన

… జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి జూన్ 22 ప్రజాబలం ప్రతినిధి:
జిల్లాలో మాదక ద్రవ్యాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం ఐ సి సి సముదాయము జిల్లా కలెక్టరేట్ లోని వీడీయో కాన్ఫెరెన్స్ సమావేశమందిరంలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ ,ఆబ్కారీ శాఖ తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్ పి
ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లి దండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఃఖం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు . నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్ కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు.
జిల్లా లో డ్రగ్స్ తో పాటు, గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా చేయాలనీ అన్నారు , చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా జరగకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యాలయాలకు దూరంలో మద్యం షాపులు ఉండాలని, బెల్ట్ షాపులపై కంప్లైంట్ వస్తె మూసి వేయించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్కూల్ కు దగ్గర ఉన్న కిరాణా, పాన్ షాపులను తనిఖీ చేయాలని, అక్కడ సిగరెట్, పొగాకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీని కోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకాలాజిస్ట్ సేవలను విస్తృతంగా వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను కళాశాలల యాజమాన్యం పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, జువైనల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి సంజీవరావు , జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారి నవీన్ చంద్ర , జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి , మహిళా శిశు సంక్షేమాధి కారిణీ వసంతకుమారి , జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు , పోలీస్ అధికారులు, ప్రభుత్వ , ప్రయివేటు కళాశాలల ప్రిన్సపల్స్ , కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ఆనంద్ రావు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking