సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ ప్రజా బలం ప్రతినిధి 03 ఎప్రిల్ 2024:
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధి శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో తన నియోజక వర్గానికి సంబంధించి అన్ని డివిజన్ ల భూత్ కమిటీ సభ్యులకు పత్రాలను అంద జేయడాని గాను తన క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ జరుపడమైనదనీ అందుకు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎలా అయితే అందరికి అందుబాటులో ఉన్నానో, ఇప్పుడు కూడా ఎం.పి గా గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అభివృద్ధి కి తోడ్పాటు పడతానని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త కలసి కట్టుగా కష్టపడి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి గురించి తెలియజేయాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లై ఓవర్ లు, రోడ్లు , బస్తి దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువలో ఉన్నామని తెలిపారు, అనంతరం ఎం.ఎల్.ఏ మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ పద్మారావు గౌడ్ అందరికి సుపరిచితుడనీ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అని తెలిపారు. ప్రతి ఒక్కరు గులాబీ దళ సైనికులుగా కదిలి మన ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిచ్చారు. ఒక్కొక్క కార్యకర్త వంద మంది ఓటరులు కలిగిన గడప గడపకు చేరుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేవలం బీ.ఆర్.ఎస్ పార్టీ మాత్రేమే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తారనీ, బిజెపి-కాంగ్రెస్ పార్టీ లు చేసినదేమి లేదని ఈ విషయాలన్నీ ప్రజలకు వివరంగా తెలియచేయాలని తెలిపారు.