ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారికి ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూరుస్తూ, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపినారు.
ప్రజాపాలన నాల్గవ రోజైన మంగళవారం నాడు తూముకుంట మున్సిపాలిటీ లోని వార్డ్ నెంబర్ 6 దేవర యంజాల్ లోని 13 వ వార్డ్ లో లో కొనసాగుతున్న. ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన సభలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రజల సౌలభ్యం కోసం ఎన్ని కౌంటర్లను ఏర్పాటు చేశారు, దరఖాస్తులను అందుబాటులో ఉంచారా, దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు, సిబ్బంది ప్రజలకు సహకారం అందిస్తున్నారా, తాగునీరు, కూర్చునేందుకు కుర్చీలు వంటి తగిన సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా వంటి అంశాలను పరిశీలించారు. ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని, ఎక్కువగా ప్రజలు ఏ పథకం కోసం దరఖాస్తు చేస్తున్నారనే వివరాల గురించి అధికారులను ఆరా తీశారు. దరఖాస్తుఫారంలో నిర్దేశించిన వివిధ పథకాలతో పాటు ఇతర అంశాలపై కూడా ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్, అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్, మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో డిసెంబర్ 28నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమం సాగుతుందని, గ్రామ, వార్డు సభలను నిర్వహించి ఏర్పాటుచేసిన కౌంటర్ల లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు పత్రాలకు ఎలాంటి కొరత లేదని, అవసరమైన ప్రాంతాలలో దరఖాస్తు ఫారాలను మరిన్ని ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందని అన్నారు. దరఖాస్తు ఫారాలను బయట డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. దరఖాస్తు పత్రంలో రేషన్ కార్డు, ఆధార్ కార్డు సహా అన్ని వివరాలను నింపి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించే 8 రోజులపాటు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటరైజ్డ్, డిజిటలైజ్ చేస్తామని అన్నారు. దరఖాస్తులను డిజిటలైజ్డ్ చేస్తున్నప్పుడు తప్పుడు వివరాలు ఉన్నప్పుడు సమస్య తలెత్తుతుందని, అందుకే దరఖాస్తు పత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ కోసం వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తూముకుంట మునిసిపల్ కమిషనర్, జైత్ రామ్ నాయక్ , పలువురు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking