స్కామ్ ఎక్కడ జరిగిందో చెప్పండి !

 

ఫ్లై యాష్ కి వే బిల్ ఉండదని ఎమ్మెల్యేకి తెలువకపోవడం సిగ్గుచేటు.

-ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే 54 కేసులు పెట్టారు..

-ఎమ్మెల్యే వదిలి ఎంవీఐ, ఆర్టీవో ఉద్యోగం చెయ్ అని హితవు..

-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ బాబు

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 11

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై ఆధారాలు లేకుండా నిందలు వేస్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తోలు తీస్తామని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వోడితల ప్రణవ్ హెచ్చరించారు. మంగళవారం హుజురాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాధార ఆరోపణలు మంత్రి పోన్నం ప్రభాకర్ పై చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్లై యాష్ స్కామ్ గురించి సవాల్ విసిరారని, మంత్రి పొన్నం వరకు అవసరం లేదని తాను సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు. చర్చకు ఎక్కడికైనా రెడీ అని అవసరమైతే లారీ అసోసియేషన్ సభ్యులను కూడా చర్చకు ఆహ్వానిస్తామన్నారు. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలని నిరాధార ఆరోపణలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నిజంగా ఫ్లై యాష్ కు సంబంధించిన స్కాం ఉంటే ఆధారాలతో నిరూపించాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. అసలు ఫ్లై యాష్ కి మంత్రికి సంబంధమేముంటుందని ఆయన ప్రశ్నించారు?. ఫ్లై యాష్ రాష్ట్రానికి సంబంధం ఉండదని, అది వేస్ట్ మెటీరియల్ గా దానిని బయటకు విక్రయిస్తారని అన్నారు. అసలు ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ కు వే బిల్ ఉండదని కనీస జ్ఞానం కూడా ఎమ్మెల్యేకు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్నాడనే భయంతో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఫ్లై యాష్ విషయంలో ఇప్పటికే లారీ అసోసియేషన్ సభ్యులు వీడియో కూడా విడుదల చేశారని, తమని ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేయద్దు అని ఆ వీడియోలో పేర్కొన్నారని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ పదవి కంటే ఎంవీఐ, ఆర్టిఏ అధికారిగా సరిపోతారని, రోజు వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేసుకుంటూ ఉంటే బాగుంటుందన్నారు. ఒక ట్రాన్స్పోర్ట్ లారీ మెటీరియల్ తో కలిపి కూడా 70 టన్నులు ఉండదని ఇంత చిన్న విషయం కూడా తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే గతంలో కూడా ఎంతోమంది అధికారులను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకోవాలని చూస్తున్నారని ఇకపై అతనికి బ్లాక్మెయిల్ స్టార్ గా నామకరణం చేస్తున్నామన్నారు. కౌశిక్ రెడ్డి ఐరన్ లెగ్ గాని వైఎస్ఆర్సిపిలో ఉంటే తెలంగాణలో పార్టీ మనుగడ లేకుండా పోయిందని, కాంగ్రెస్ లో ఉన్నంతకాలం పార్టీ అధికారంలోకి రాలేదని బిఆర్ఎస్ కి చేరగానే బిఆర్ఎస్ అధికారం కోల్పోయిందని ఎద్దేవా చేశారు. కెసిఆర్, కేటీఆర్ లు కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులను పక్కకు పెట్టుకుంటే వారి గౌరవం కూడా తగ్గుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరు విజయ్ కుమార్, పొనుగంటి మల్లయ్య, కాజీపేట శ్రీనివాస్, మిడిదొడ్డి శ్రీనివాస్, మిడిదొడ్డి రాజు, అమర్, కొలిపాక శంకర్, సొల్లు బాబు, పుష్పలత, లంకదాసరి లావణ్య, చందమల్ల బాబు, సమ్మెట సంపత్, మంద బిక్షపతి, లావణ్య, మేకల తిరుపతి, మేకల తిరుపతి, సమ్మెట సంపత్, దుబాసి బాబు, కరీమా, లక్ష్మీ, మల్లీశ్వరి, రాధ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking