మహిళలపై జరుగుతున్న అరాచకాల పై అవగాహనా సదస్సు
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 21 (ప్రజాబలం) ఖమ్మం మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సుమ ఆధ్వర్యం లో జిల్లా సాధికారత కేంద్రం సభ్యులు, సఖి సిబ్బంది లింగ వివక్షత ను అంతం చేయడానికి మహిళలు, ఆడపిల్లలు రక్షణ, భద్రతా, సాధికారత, మహిళల పై జరుగుతున్న హింసను వ్యతిరేకించడానికి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎచ్ఈడబ్ల్యూ సిబ్బంది మాట్లాడుతూ మహిళల రక్షణ, భద్రథ మరియు సాధికారత కు సంబందించిన చట్టాలు , పధకాలు , సెవలు, అత్యవసర హెల్ప్ లైన్ నoబర్లు, బెటీ బచావో బెటి పడావో అనే నినాదానికి మనందరం మన వంతు బాధ్యత గా ఆడ పిల్లలను కాపాడాలి, చదివించాలి అలాగే స్థిరమైన రేపటి కోసం మనమంతా లింగ సమానత్వం పాటించాలని, ఆడ పిల్లలను రక్షించడం మరియు చదివించడం కొరకు మనందరం కలిసి పని చేయాలని. మహిళలు, పిల్లలకు సంబంధించిన అన్ని రకాల హెల్ప్ లైన్ నెంబర్లు (1098,181,100,112,1930) సైబర్ క్రైమ్ అవగాహన కూడా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో డిఎచ్ఈడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్లు ఎస్.డి సమ్రీన్, పగిడిపల్లి ప్రమీల, కుమ్మరి సతీష్ ,వేపకుంట్ల హై స్కూల్ హెడ్ మాస్టర్, పాఠశాల సిబ్బంది అంగ న్వాడీ టీచర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు