రాజకీయ పార్టీల వైఖరి తెలపాలి..

మాదిగలకు 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి..
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ డిమాండ్..

ఆగస్టు 16 ప్రజాబలం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ లకు 14 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని,రాజకీయ పార్టీలు బిఆర్ఎస్,కాంగ్రెస్,బిజెపి పార్టీలు తమ వైఖరి తెలపాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస.ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మైస.ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ స్వలాబాల కోసం మాదిగ లను వాడుకుంటున్నారని రాజకీయంగా మాదిగ లను సమాది చేస్తున్నాయని విమర్శించారు.రాబోయే జనరల్ ఎలక్షన్ లలో మాదిగ లకు 14 స్థానాలను ఏపార్టీ కేటాయిస్తుందో ఆయా పార్టీ లకు మాదిగలు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.మాదిగ లను విస్మరిస్తే మాత్రం మాదిగలు ఆయా పార్టీ లకు తగిన బుద్ది చెపుతాయని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో 14 శాతం ఉన్న మాదిగ లకు శాసనసభలో తక్కువ శాతం ప్రాతినిధ్యం ఇస్తూ 4 శాతం ఉన్న మాల లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పార్టీలు మాదిగ ల ఎదుగుదలను ఆపుతూ రాజకీయంగా అణిచివేస్తూన్నాయని మండిపడ్డారు.ఈసారి జరిగే జనరల్ ఎలక్షన్ లలో మాదిగ లకు 14 స్థానాలు కేటాయించాలని ఆయా పార్టీ లను డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking