ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్ట పరిహారం చెల్లించే వరకు బిజెపి పోరాటం అగదు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 18  : మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ముంపు బాధితులకు పెండింగ్ లో బకాయిలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి అని అన్నారు.శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం ముంపు బాధిత ప్రజలతో కలిసి రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ…ముంపు బాధితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించే వరకు బిజెపి పోరాటం ఆగదని బిజెపి పార్టీ వారికి అండగా ఉంటుందని అన్నారు,ముంపు బాధితులకు వారం రోజుల్లో బాధితులకు చెల్లించకపోతే బాధితులతో కలిసి మరింత ఉద్యమిస్తామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking