సామాన్యుడిపై కరెంటు బిల్లుల మోత.. అమలులో లేని గృహజ్యోతి..

– ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జీరో బిల్లు రాని పరిస్థితి
– ఉపముఖ్యమంత్రి చెప్పినట్లు బిల్లు కట్టకుండా ఉన్న సామాన్యులు.
– ఇప్పుడు వేలకు వేలు బిల్లు బకాయిలు
– జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో కరెంటు అధికారుల దాడులు.
– కనెక్షన్లు కట్ చేస్తున్నటువంటి వైనం

జమ్మికుంట ప్రజబలం ప్రతినిధి జూలై 9

-: ప్రజా పాలన వచ్చింది ప్రజా సమస్యలు తీరుతాయని సామాన్యుడు సంబర పడ్డటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది గృహాలకు ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు వాడుకుంటున్నటువంటి గృహాలకు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ. అమలులో మాత్రం సామాన్యుడిని ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితిగా అవుపడుతున్నది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జూనియర్ లైన్మెన్లు ఇండ్లలోకి వచ్చి ప్రజా పాలన దరఖాస్తు నెంబర్లు మీటర్ నెంబర్లు రేషన్ కార్డు నెంబర్లు రాసుకొని వెళ్లినప్పటికీ, మున్సిపల్ కార్యాలయంలో మరొకసారి దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ జీరో బిల్లులు రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సామాన్యుడు బాధ్యుడా. ఇదే అదునుగా చూసుకొని మంగళవారం నాడు కొత్తపల్లి పరిధిలో లైన్మెన్లు ఇండ్ల చుట్టూ తిరుగుతూ కరెంటు బిల్లులు కట్టాలి లేకపోతే మీ కరెంటు కట్ చేస్తామని కరెంటు కట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని సామాన్యుడు బిల్లులు కట్టలేక లబోదిబోమంటూ మొత్తుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నవి. ఈ విషయం పైన కొత్త పల్లి.కి సంబంధించి హబీబ్ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నటువంటి నిరుపేద వ్యక్తి తనకు వచ్చిన 6000 రూపాయల కరెంటు బిల్లు కట్టలేక ఆటో నడవలేక జీరో బిల్లు రాలేక ముప్పు తిప్పలు పడుతున్నట్లుగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు గానీ స్థానిక నాయకులు గానీ 200 లోపు యూనిట్లు కాలుతున్నటువంటి ఇండ్లకు జీరో బిల్లు వచ్చేటట్లుగా చేయాలని సామాన్యులను ఇబ్బందులు పెట్టొద్దని ప్రజలు కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking