జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 05 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కోనుగోలు క్రేంద్రాల ద్వారా రైతు వద్ద నుండి నిబంధనల మేరకు వరి ధాన్యం కొనుగోలు చేసి ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లర్లకు సామర్థ్యం మేరకు కేటాయించడం జరిగిందని ఈ క్రమంలో ఆయా రైస్ మిల్లర్లు తమ నిర్దేశించిన సి.ఎం.ఆర్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు.బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ బాదావత్ మోతిలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉమరాణితో కలిసి సంబంధిత అధికారులతో సి.ఎం.ఆర్. ప్రక్రియ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా లో 286 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని నిబంధన ల మేరకు కొనుగోలు చేయడం జరిగిందని,నిర్దిశిత లక్ష్యం పూర్తి చేయబడిన 281 కొనుగోలు కేంద్రాలను మూసి వేయడం జరిగిందని,5 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొరసాగుతుందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతుల,విక్రయించిన ధాన్యం వివరాలను ట్యాబ్ లో నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.కొనుగోలు సమయంలో రైతుల కు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లర్లకు ఆయా మిల్లర్ల సామర్థ్యం మేనకు ధాన్యం కేటాయించి తరలించడం జరిగిందని, ధాన్యం పొందిన రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన సి.ఎం.ఆర్.లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.లక్ష్యసాధనలో నిర్లక్ష్యం,అలసత్వం వహించవద్దని రైస్ మిల్లర్లు పై క్రిమినల్ కేసులు నమోదు చెయడం జరుగుతుందని తెలిపారు.పెద్దపల్లి తరలించిన ధ్యానం సంబంధించిన నగదును ఆయా రైతుల ఖాతా లలో త్వరలోనే జిమ్ చెయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.