రూల్స్ కి వ్యతిరేక చర్యగా డ్రైనేజ్ లైన్ కలుపడాన్ని నిరసిస్తున్న ది సిటిజెన్స్ కౌన్సిల్.

 

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 24 జూన్ 2024:
ప్రజా సౌకర్యార్థం ముందుండే ది సిటిజెన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి, షేక్ ఆరిఫ్ మొహమ్మద్, కోశాధికారి దిలీప్ కక్కడ్, సంయుక్త కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, సభ్యులు సాగర్, రామ సుబ్బారెడ్డి లు, డైరెక్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ప్రస్తుత కమిషనర్ దివ్య ఐ.ఏ.ఎస్ ని కలసి హైదరాబాద్ నగర పరిగణలోకి వచ్చే హుడా కాలనీ తానాషా నగర్లో ఎనిమిది వందల యాభై ఫ్లాట్లతో అంబియన్స్ కోర్ట్ యార్డ్ పేరుతో నెలకొను చున్న బహుళ అంతస్తుల సముదాయం నుండి వచ్చే మురుగు మరియు వర్షపు నీరు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారి ఆద్వర్యంలో షేక్పేట్ నాలా లోకి తరలించడానికి బదులు మణికొండ కౌన్సిల్ పరిధిలోని గాయత్రీ అపార్ట్మెంట్, ఎంప్లాయిస్ కాలనీ దగ్గర పందెం వాగులో కలుప డానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారనీ, ఇందుకు గాను గత కొన్నిరోజులుగా గాయత్రీ అపార్ట్మెంట్ నివాసులు, ఎంప్లాయిస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, హుడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, తానాషా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలసి సామూహికంగా ఈ విషయమై చాలాసార్లు పోరాటం సాగిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఇంత పెద్ద బహుళ అంతస్తుల సముదాయం వస్తున్నప్పుడు కనీస మౌలిక వసతులైనటు వంటి రోడ్డు, డ్రైనేజీ మరియు త్రాగునీరు సముచిత స్థాయిలో ఉన్నాయా లేదా అనే ఆలోచన కూడా లేకుండా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు విచక్షణా రహితంగా అనుమతులు ఇవ్వడం జరిగిందనీ, అది ఆసరాగా చేసుకుని గత ఎన్నికల సమయం చూసుకొని ఈ బహుళ అంతస్తు సముదాయానికి అండర్ గ్రౌండ్ ద్వారా విద్యుత్ శక్తి సరఫరా అందించడం జరిగినదనీ, మణికొండ పురపాలక సంఘ పరిధిలోనీ పందెం వాగు నాలా ద్వారా మురుగు నీరు ప్రవహిస్తు వెదజల్లుతున్న దుర్వాసన వలన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వందల కుటుంబాల పరిస్థితి ఇక్కడున్న ప్రజానీకానికి తెలుసు. ఒకపక్క ఈ సమస్య గురించి ప్రజలు ప్రతిఘటిస్తుంటే ఇంకొక పక్క ఇప్పటికే మణికొండ చుట్టుపక్కల దాదాపు 40 బహుళ అంతస్తు సముదాయాలకు అనుమతులు ఇచ్చిన కారణంగా రాబోయే కాలంలో పందెం వాగు నాలా పరివాహక ప్రాంతం, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయందోళనలకు గురి అవుతున్నారనీ, సాధారణంగా డ్రైనేజ్ పైప్ లైన్ పనులను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారి ఆద్వర్యంలో నిర్వహిస్తారు, కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే మణికొండ మున్సిపాలిటీ వారు అంబుయన్స్ కోర్ట్ యార్డ్ బిల్డర్ కే నేరుగా డ్రైనేజ్ పైప్ లైన్ వేసుకునే వెసులుబాటు కలిగించారు, ఇది రూల్స్ కి పూర్తిగా వ్యతిరేక చర్య అని మరియు పైన పేర్కొన్న అంబుయన్స్ కోర్ట్ యార్డ్ బహుళ అంతస్తుల సముదాయం పట్ల అధికారులు ఎందుకంత చొరవ చూపిస్తున్నారో అర్థం కావడం లేదనీ, వారు కొనసాగిస్తున్న డ్రైనేజ్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని ది సిటిజెన్స్ కౌన్సిల్ తరపున సీతారాం ధూళిపాళ అధ్యక్షుడు, అందె లక్ష్మణరావు ఉపాధ్యక్షుడు, షేక్ ఆరిఫ్ మొహమ్మద్ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి దిలీప్ కక్కడ్, సంయుక్త కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, సభ్యులు సాగర్, రామ సుబ్బారెడ్డి మొదలగు వారు వినతి పత్రం సమర్పించడం జరిగిందనీ, ఈ సమస్యపై సి.డి.ఎం.ఏ అధికారిణి సానుకూలంగా స్పందించి తగు చర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పడం జరిగిందనీ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ జెసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking