మణికొండ పురజనులకు మౌలిక సదుపాయాలకై పాటుపడుతున్న ది సిటిజన్స్ కౌన్సిల్.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 జూన్ 2024:
ది సిటిజన్స్ కౌన్సిల్ తమ లక్ష్యంగా మణికొండ పురజనులకు మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం పర్యవేక్షిస్తున్న చీఫ్ ఇంజనీర్ కోటేశ్వరరావుని కలసి పందెం వాగు నాలాపై పూర్తి స్థాయిలో బాక్స్ డ్రైన్ నిర్మాణం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బుల్కాపూర్ మరియు మల్కం చెరువుల ద్వారా వచే మురుగునీరు షేక్పేట్ నాలాలోకి తరలించవలసి ఉండగా అప్పట్లో డిజైన్ తప్పిదం వల్ల మొత్తం మురుగు నీరు పంచవటి కాలనీ దగ్గర పందెం వాగులోకి మళ్లించడం కారణంగా గడచిన పది పన్నెండు సంవత్సరాలకు పైగా పందెం వాగు చుట్టుపక్కల వేలమంది జనాలకు తీవ్ర దుర్గంధం వెధ జల్లడం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని, వర్షాకాల సమయంలో పలుచోట్ల పందెం వాగు పొంగి పొర్లి వరదలుగా తలపిస్తూ కాలనీలకు కాలనీలను ముంచెత్తడం ప్రతి ఒక్కరూ గమనిస్తున్న విషయమే. వరద నివారణ చర్యల్లో భాగంగా పంచవటి కాలనీ నుండి ట్రైల్స్ గేటెడ్ కమ్యూనిటీ వరకు ప్రస్తుతం బాక్స్ డ్రైన్ నిర్మాణం జరుగుతున్నదనీ అట్టి నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి రహదారి వాహనాలకు వెసులుబాటు కలుగ జేయ వలసిందిగా మరియు బాక్స్ డ్రైన్ నిర్మాణాన్ని నిక్నాంపూర్ వరకు పొడిగించ వలసిందిగా కోరడమైనది. రాబోవు కాలంలో దాదాపు 40 పై చిలుకు బహుళ అంతస్తు సముదాయాలు రానున్న కారణంగా మరియు మణికొండ పురపాలక సంఘం పరిధిలో మురుగు నీరు పారుదలకు ఏకైక నాలా అయినటు వంటి పందెం వాగును ఆధునీకరించవలసిన అవసరాన్ని వారి దృష్టికి తేవడం జరిగింది. మణికొండ పురజనుల ప్రధాన సమస్యను జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది. అటులనే ది సిటిజన్స్ కౌన్సిల్ వినతి మేరకు నెక్నాంపూర్ స్పెక్ట్రమ్ విల్లాస్ దగ్గర ప్రస్తుతమున్న లో లెవెల్ బ్రిడ్జి ప్రాంతంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పట్ల మణికొండ పురపాలక సంఘం సానుకూలంగా స్పందించినందుకు, నీటి ప్రవాహానికి ఇబ్బంది రాకుండా పూర్తిస్థాయి కాంక్రీట్ బ్రిడ్జి నిర్మించ వలసిందిగా విజ్ఞప్తి చేస్తు పాలక వర్గానికి, అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ది సిటిజన్స్ కౌన్సిల్ తరపున ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ రావు కార్యదర్శి షేక్ ఆరిఫ్ మహమ్మద్ మరియు ఉప కార్యదర్శి ఉపేందర్నాథ్ రెడ్డిలు ఇట్టి వినతి పత్రం అందజేయడం జరిగిందనీ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలియ జేసినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking