రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 27 జూన్ 2024:
మణికొండ గవర్నమెంట్ జిల్లా పరిషద్ హై స్కూల్ నుండి పదవ తరగతిలో ఉన్నతంగా ఉత్తీర్ణత సాధించిన ఆరుగురు విద్యార్థుల పై చదువులకు ఎన్నిక గావించి, అన్ని రకాల సహాయ సహకారాలందిస్తున్న వీ.ఆర్.4 సహాయోగ్ చారిటబుల్ ట్రస్టు వారికి సహృదయంతో సహకరిస్తున్న ట్రస్ట్ సభ్యుడు, ది సిటిజన్స్ కౌన్సిల్ కార్యదర్శి బీ. ఉపేంద్రనాధ్ రెడ్డి ఉదారతతో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న వీ. మహేశ్వరికి మరియు పీ.చక్రికల మొదటి సంవత్సరం చదువు గురించి అయ్యె మొత్తం ఫీస్ ను శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యానికి రెండు దఫాలుగా చెక్కుల రూపంలో కట్టడానికి ముందుకు రావడం శుభ పరిణామని, ఇప్పటి వరకు ఎం.మిర్యామి, ఎన్.శిరీష మరియు పూజా రాథోడ్ ల యొక్క ఫీస్ లను ట్రస్ట్ సభ్యులు నరోత్తం సింగ్, రమ్యా గణపతి రాజు, నిర్మల్ చంద్ గొలెచా కుటుంబీకుల ఆర్థిక సహకారంతో నార్సింగిలోని జాగృతి కాలేజ్ లో మొదటి కిస్తి కట్టడం జరిగినదని మరియు పూజా సింగ్ యొక్క మొదటి సంవత్సరం ఫీస్ ప్రముఖ ఎముకల డాక్టర్ బోగా శ్రీనివాస్ కొంత మేర చెక్కుల రూపంలో శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యానికి కట్టడం జరిగినదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ, మొత్తంగా 6 గురు విద్యార్థులకు తలపెట్టిన పై చదువుల ఖర్చులు సమయోచితంగా పాక్షికంగా ఆర్థిక సహాయాన్ని అందజేసిన దాతలకు ప్రత్యేకముగా ది సిటిజన్స్ కౌన్సిల్ కార్యదర్శి బీ.ఉపేంద్రనాధ్ రెడ్డికి ట్రస్ట్ తరపున ధన్యవాదములు తెలియ పరుస్తూ, చదువుల తల్లి సరస్వతీ దేవాలయంకు రాబోయే సమయానికి ఫీస్ కట్టడానికి దాతలు ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఈ శుభ పరిణామ సమయాలలో ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరిఫు మొహమ్మద్, కోశాదికారి దిలీప్ కక్కడ్, కార్యదర్శి బీ.ఉపేంద్రనాధ్ రెడ్డి, రామసుబ్బా రెడ్డి, ట్రస్ట్ సభ్యులు నిర్మల్ చంద్ గొలెచా, తబ్రెజ్ హుస్సేన్, విద్యార్థులు వారి తల్లి తండ్రులు పాల్గొనడం జరిగినది.