రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 19 జూన్ 2024:
హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఐ.టీ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతున్న ప్రాంతాలన్నిటికి ప్రక్కనే ఉన్న మణికొండ ఎత్తైన కట్టడాలు కట్టడానికి అనువుగా ఉన్నందు వలన జనాభా పరంగా శీఘ్ర పెరుగుదలవుతున్న మాట అతిశయోక్తి కాదనీ, మణికొండ, పుప్పాలగూడ, నెక్నంపూర్ గ్రామ పరిసర ప్రాంతాలలో రోడ్డు వెడల్పు చేయాలని, చేయనందు వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకు రాగా, అట్టి విషయమై తన పరిధి లోకి రాదని తెలుపగా, ఈ విషయమై కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టి పై అధికారుల మరియు గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్ళ వలసిన భాధ్యత మీ పై ఉన్నదని అట్టి మార్గం అనుసరించమని ది సిటిజన్స్ కౌన్సిల్ సంస్థ సభ్యులు తెలియజేస్తూ, తమ సంస్థ ప్రజల కనీస అవసరాలు అయినటు వంటి త్రాగునీరు, సరియగు మురుగునీటి పారుదల వ్యవస్థ, రహదారులు, సరియగు విద్యుత్ శక్తి పొందే విధంగా కృషి చేయడం, ప్రధాన ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, సమాచార హక్కు ద్వారా ప్రభుత్వ సంస్థల పనితీరులో పారదర్శకత మరియు సుపరిపాలన అందించే విధంగా ప్రయత్నం చేయడం, కనీస అవసరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో భాగంగా తాము ముందుంటామని, కావున ప్రస్తుతానికి ప్రత్యాయముగా విద్యుత్తు స్తంబాలని సరిచేయిస్తూ, రోడ్డు ఆక్రమణలను తొలగిస్తూ, గుంతల మయంగా ఉన్న రోడ్లు రహదారి బాటసారులకూ, వాహన చోదకులకు నరక యాతన లేకుండా రోడ్డు మరమ్మత్తులు చేయించమని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, ప్రధాన కార్యదర్శి శేక్ ఆరిఫ్ మొహమ్మద్, కార్యదర్శి ఉపేంద్రణాధ్ రెడ్డి, కోశాదికారి దిలీప్ కక్కడ్ లు మణికొండ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించగా అందుకు కమిషనర్ వెంటనే స్పందించి డీ.ఈ నీ పిలిచి మణికొండ రోడ్లలో ఉన్న చిన్నా పెద్ద గుంతలను వెంటనే మరమ్మత్తులు చేయించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగినదని కౌన్సిల్ అధ్యక్షుడు సీతారామ్ ధూళిపాళ పత్రికా ప్రకటన విడుదల చేసినారు.
Next Post