6 గ్యారంటీల పథకం అమలుకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన 20 రోజుల్లోనే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాల అమలుకు నేడు శ్రీకారం చుట్టిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు వర్తిస్తాయని, ఇప్పటికే రెండు గ్యారెంటీల పథకం అమలు జరుగుతూ ఉందని, ఇది నిజమైన పేదవాడి ప్రభుత్వమని పొంగులేటి ప్రధాన.
అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు కామేపల్లి మండలం జోగుగూడెం, గరిడేపల్లి గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామసభలలో పాల్గొన్నమల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నే పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, 108 పథకాలు మంజూర య్యాయని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా పేదవాడిని గుర్తించలేకపోయారని, గత ప్రభుత్వం హయాంలో పేదవాడు ఇంకా పేదవాడుగా ధనవంతుడు ఇంకా ధనవంతు డుగా మారిపోయారని ఆరోపించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే పైరవీలకు అక్రమాలకు ఆస్కారం లేకుండా నిజమైన అర్హుడికి ఇండ్లు పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయని, గ్రామ సభలలో దరఖాస్తులు ఇవ్వలేకపోయినప్పటికీ, మండల కార్యాలయంలో ఇవ్వవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని పేదల రాజ్యమంటే ఇందిరమ్మ రాజ్యం అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎండిఓ, ఏ ఈ ఓ, హెల్త్ అధికారులు, సర్పంచులు భగవాన్ నాయక్, ధరావత్ రాంజీ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking