-సీఎం రిలీఫ్ ఫౌండ్ చెక్కుల ద్వారా కుటుంబాలకు భరోసా
-సిఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
హుజురాబాద్ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 4
హుజురాబాద్ నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరు ఆపదలో ఉన్న ఎలాంటి కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటానని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నదని హుజురాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహాకారం ఉందని ఎవరు ఆధైర్యపడవల్సిన అవసరం లేదని బుధవారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ కారణాల వల్ల అనారోగ్యం చెందినవారికి వారి కుటుంబాలకు
భరోసాగా సిఎం,ఆర్,ఎఫ్ చెక్కులు అందజేసిన సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ నియోజకవర్గంలో వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అర్హులైన నిరుపేదలందరికి సహాయం అందుతుందన్నారు.
ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంక కొని సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్నామని ప్రజలు గమనిస్తున్నారని వోడితల ప్రణవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.