అధ్వానంగా మారిన గుండ్రెడ్డిపల్లి వెళ్లే బీటీ రోడ్డు :- అధికారులు స్పందించాలని గ్రామస్తుల ఆవేదన.

 

తూప్రాన్, జనవరి 10 (ప్రాజబలం న్యూస్) :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డీపల్లి గ్రామానికి వెళ్లే బిటి రోడ్డు పూర్తిగా అద్వానంగా తయారయింది. ఆ రహదారి మీదుగా వివిధ ప్రాంతాలకు ఆటో, కారు మరియు బైకుల పై వెళ్ళుచున్న పరిసర గ్రామాల ప్రయాణికులకు స్కూల్ విద్యార్థులకు మహిళలకు వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇది గత కొంతకాలంగా ఇలానే ఉందని ప్రయాణికులు వారి బాధను వెలిబుస్తున్నారు. ఈ గ్రామాల మీదుగా అనేక అధికారులు పలువురు రాజకీయ నాయకులు వస్తూ వెళ్తున్నారు చూస్తున్నారు కానీ ఈ రహదారిని పట్టించుకునే నాధుడే లేడు. ఇకనైనా రోడ్డు సంబంధిత అధికారులు సంబంధిత గ్రామ నాయకులు ఈ రోడ్డు మరమ్మత్తుల విషయాన్ని పై అధికారులకు తెలిపి రోడ్డు మరమ్మత్తులను తక్షణమే చేపట్టాలని సంబంధిత గ్రామాల ప్రజలు వారి ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking