చట్టాలపై అవగాహన బుక్ ను ఆవిష్కరించిన జిల్లా జడ్జి

పాత చట్టాలు – కొత్త చట్టాల అవగాహన సెక్షన్ల వారీగా మూడు కొత్త చట్టాలపై సీనియర్ న్యాయవాది మెట్ట అనిల్ కుమార్ రచించిన సంక్షిప్త హ్యాండ్ బుక్ ను కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ ఆవిష్కరించారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శిలు పీవీ రాజ్ కుమార్, బెతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా జడ్జి బి ప్రతిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతు పాత చట్టాలు – కొత్త చట్టాలు అవగాహన కల్పన పై సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్ రచించిన సంక్షిప్త హ్యాండ్ బుక్ సీనియర్ , జూనియర్, మహిళా న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడేలా విధంగా ఉందన్నారు. గతంలో కూడా సివిల్ చట్టాలపై బుక్కును రచించారని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి రఘువీర్, కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు గులాబీల మల్లారెడ్డి పటేల్, పెంచాల ప్రభాకర్ రావు, యాదగిరి, కే శ్రావణ్ కుమార్, జనార్దన్ గౌడ్, కొట్టే తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, మల్లేశం, ముని వేణుగోపాల్, శ్రీనివాసరావు , జూనియర్ న్యాయవాదులు, మహిళ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking