—-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రజాబలం కొల్చారం మండలం నవంబర్ (04)
నర్సాపూర్ లో త్వరలో ఐసీయూ, ఎన్ డి సి, అత్యవసర వైద్యశాఖ, ట్రామా కేంద్రాల ఏర్పాటు
ఐదు బెడ్లతో డయాలసిస్ కేంద్రం ఈరోజు నుంచి సేవలందిస్తుంది
నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి
5 పడకల సామర్థ్యంతో రూ. 50.00 లక్షల రూపాయల వ్యయంతో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ, నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొనీ, ప్రారంభించారు.
నూతన డయాలసిస్ సెంటర్ 22 మంది డయాలసిస్ రోగులకు నేటి నుంచి లబ్ధి చేకూరనుంది
ఏరియా హాస్పిటల్, నర్సాపూర్ – 5 పడకల కెపాసిటీతో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం
నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి పరిధిలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మరియు 1 కమ్యూనిటీ హెల్త్ సెంటర్, నర్సాపూర్ పట్టణం మధ్యలో ఉంది, ఇందులో కౌడిపల్లి మొత్తం కలిపి సుమారు 2 లక్షల మంది జనాభా ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ మెదక్ జిల్లా మెదక్ జిల్లా ఆసుపత్రిలో సుమారు 100 మందికి పైగా డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారని. 100 మందిలో, 22 మంది డయాలసిస్ రోగులు నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వారిగా వివరించారు.
నర్సాపూర్ నియోజకవర్గం నుండి మొత్తం రోగులు: 22 మంది రోగులు
నర్సాపూర్-7, కౌడిపల్లి-5, కుల్చారం మండలం – 10 రోగులు ఉన్నట్లు పేర్కొన్నారు వారానికి 3 సార్లు : 14 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లుగా వివరించారు.
ఈ 22 మంది డయాలసిస్ రోగులే కాకుండా సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, నిమ్స్, హైదరాబాద్, మల్లారెడ్డి ఆసుపత్రుల్లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరు రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. నర్సాపూర్ ప్రాంతానికి త్వరలో ఐసీయూ ఎన్డీసీ ట్రామా అత్యవసర శాఖ లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం వైద్య ఆరోగ్యం పై నూతన పాలసీని అమలు చేస్తామన్నారు.
మహమ్మద్ నగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనర్సింహ,
అనంతరం కౌడిపల్లి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో మాట్లాడారు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు స్థిరమైన లక్ష్యం ఉండాలని విద్యార్థులకు సూచించారు.