వికలాంగులు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎన్ పి ఆర్ డి క్యాలెండర్ ను ఆవిష్కరించిన
……జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి.
సంగారెడ్డి జనవరి 12: ప్రజ బలం ప్రతినిది: . వికలాంగుల సంక్షేమo కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు
ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి) 2024 క్యాలెండర్ ను కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు ఆవిష్కరణ చేశారు
ఈ సందర్బంగా *జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలను అమలు చేస్తున్నాయని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికలాంగులను అవమాన పరిచే విధంగా మాట్లాడడం 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం నేరమని అన్నారు. అంగవైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని అనేక మంది నిరూపించారాని అన్నారు. వైఖల్యం ఉన్న పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు.వైఖల్యం కలిగిన పిల్లలు చదువుకునే విదంగా తల్లిదండ్రులు ప్రోత్సాహించాలని అన్నారు. వికలాంగుల కోసం ఉన్న చట్టాలు, జీవో ల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని అన్ని రంఘాల్లో ముందుకు వెళ్లాలని అన్నారు.జిల్లాలో ఉన్న వికలాంగులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు
2024 నూతన సంవత్సరం ఎన్పీఆర్డి ముద్రించడం అభినందననీయమని అన్నారు.
ఈ కార్యక్రమంల డిఆర్ఓ యం నగేష్, సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు గొల్లపల్లి జయరాజు, ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కార్యదర్శి యం.అడివయ్య, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి తలారి గోపాల్, కె వి పి ఎస్ జిల్లా అధ్యక్షలు మాణిక్, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రచార కార్యదర్శి మన్నే పోచయ్య,జిల్లా ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి,సంగారెడ్డి డివిజన్ కార్యదర్శి వెంకయ్య, జిల్లా కమిటీ సభ్యులు రాంచంధర్ తదితరులు పాల్గొన్నారు.