మహిళల రక్షణే ధ్యేయం

 

ప్రజాబలం ప్రతినిధి :
రాచకొండ సిపి తరుణ్ జోషి
బాలికలను, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్‌ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ డా.తరుణ్ జోషి తెలిపారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్‌ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడించే వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని అన్నారు.
రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు మంగళవారము రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 125 మేజర్స్-42, మైనర్స్-83 మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు. వారికి ఎల్‌బి నగర్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసులో, కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking