ఆశ కార్యకర్తను దూషించి మాట్లాడిన అధికారి.

ఆశ కార్యకర్తను హెల్త్ సూపర్ వైజర్ అనిల్ డేవిడ్ ని సస్పెండ్ చేయాలి.
సిఐటియు జిల్లా అధ్యక్షులు
ఏ. మహేందర్ రెడ్డి డిమాండ్.

ప్రజాబలం మెదక్ తూప్రాన్ సెప్టెంబర్ 4 న్యూస్ :-

ఆశ డే సందర్భంగా చిన్నశంకరంపేట
పి హెచ్ సి లో ఆశల కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించిన మెడికల్ సూపర్ వైజర్ అనీల్ డేవిడ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ.మహేందర్ రెడ్డి తూప్రాన్ లో బుధవారం రోజున మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను చిన్నచూపు చూసి మాట్లాడిన అధికారిని విధుల నుంచి తొలగించాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలను ఉద్దేశించి బూతులు తిడుతూ,ఆశ కార్యకర్తలపై చెయ్యి చేసుకొని దుష్ప్రచారలాడిన వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేసి,అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గ్రామాలలో తమ శక్తి కొలది ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తారు.
ఆ అధికారి హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్నారు. గ్రామంలో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న వారిని ఒక హెల్త్ సూపర్ వైజర్ బూతులు తిట్టవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు.మెడికల్ అధికారి ముందే ఇలా వ్యవహరిస్తే ఇంకా ఎవరు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్దం చేసుకో వచ్చన్నారు. ఆరోగ్య సేవపై సలహాలు ఇవ్వాల్సింది పోయి ఒక అధికారిని అనే అహంకార పూరితంగా ఆశా కార్యకర్తల పట్ల ప్రవర్తించిన తీరు మెడికల్ సూపర్ వైజర్ ను పై అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు.మళ్ళీ ఇలాంటివి జిల్లాలో పునరావృత్తం కాకుండా జిల్లా ఉన్నతాధికారులు చూడాలన్నారు. ఉన్నత స్థాయి వైద్యాధికారులు అధికారులు ఈ సంఘటనపై వెంటనే విచారణ చేపట్టి హెల్త్ సూపర్వైజర్ అనిల్ డేవిడ్ ను సస్పెండ్ చేయాలని కోరారు. ఒకవేళ ఆ అధికారిపై చర్యలు తీసుకొని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు,ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking