చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలి

 

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకి కేటీఆర్ దిశానిర్దేశం

సన్నాహక భేటీలో పాల్గొన్న సబితాఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి తదితర నేతలు

 రంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి:

చేవెళ్ల పార్లమెoట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రానున్న పార్లమెoట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ గడ్డ మీద బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మన బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ ఉందని గుర్తు చేశారు. అదేస్థాయిలో… అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ కోరారు. కాగా, ఈ భేటీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking