జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి.

టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 9

వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు వినతి పత్రం ఇచ్చిన జర్నలిస్టులు ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు వృత్తిలో భాగంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. వోడితల ప్రణవ్ జర్నలిస్టులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జర్నలిస్టుల ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను,ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని ప్రణవ్ తెలిపారు. మీ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ప్రణవ్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సౌడమల్ల యోహన్ అయితే రాధాకృష్ణ ఖాజా ఖాన్, దొడ్డే రాజేందర్ ప్రసాద్, ఏబూసి సంపత్, కోక్కుల శ్రీరామ్, టి. రాజు, అంబాల శ్రీరామ్, అంబాల రాజు, ఎండి రఫీ, రచ్చ రవికృష్ణ, సంతోష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking