ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 31 : జిల్లాలో పంట సాగుకు ఉపయోగించే పచ్చి రొట్ట,పత్తి విత్తనాల ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజిపూర్ మండలం పడ్తైనపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలను అకస్మక చేసి పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ విధానాన్ని కనిపించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ద్వారా 60 శాతం రాయితీ పచ్చి రొట్ట విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా పంట సాగు అవసరమైన మేర పచ్చి రొట్ట లభ్యత ఉందని ఆన్లైన్లో టి- సీడ్స్ పోస్టర్ల ద్వారా పంపిణీ జరుగుతున్న విధానం,స్టాక్ విలువలను పరిశీలించారు. పంట సాంగులో పచ్చిరొట్ట వలన కలిగే ప్రయోజనాన్ని రైతులకు వివరించాలని సేంద్రియ పద్ధతిలో సాగు జరిగేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం స్థానిక మల్లికార్జున ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మాదిక తనిఖీ చేసి పత్తి విత్తనాల లభ్యత, ఎరువుల స్టాక్ వివరాలను పరిశీలించారు. జిల్లాలోని నకిలీ,నీషేధిత ప్రతి విత్తనాలు ఎరువుల విక్రయం,వినియోగం జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చెబుతున్నామని, నిషేదత విత్తనాలు,ఎరువులు విక్రయాలు జరిపే వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సాంకేతిక అధికారి సంకె శ్రీనివాస్,మండల వ్యవసాయ అధికారి డి.కృష్ణ,ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యనిర్వహణాధికారి, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.