– ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న

 

 

– పట్టభద్రుల ఆత్మబంధువు తీన్మార్‌ మల్లన్న

– బ్లాక్ మెలార్ల కు బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్

– అధికారము పోయిన కేటీఆర్ కు అహం పోలేదు

– కేటీఆర్ పై నిప్పులు చెరిగిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 25: శుక్రవారం రోజున ములుగు మండలం లోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ లో జరిగిన ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు పైడా కుల అశోక్ గారి అధ్యక్షతన నిర్వహించగా ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు మరియు పట్టా భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా గుర్తించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశ్నించే గొంతు పట్ట భద్రులకు ఆత్మ బంధువు తీన్మార్ మల్లన్న అని గత 10 యేండ్ల నుండి ఆనాటి దొరల పాలన సాగించిన కెసిఆర్ పై పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన పై తీ న్మార్‌ మల్లన్న తన ఛానల్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను మొలుకోల్పి ప్రజల పక్షాన కొట్లాడిన మల్లన్న పై ఆనాటి కెసిఆర్ ప్రభుత్వం మల్లన్నపై కక్ష గట్టి జైలుకు పంపిందని ప్రజల పక్షాన నిలిచి మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్ట భద్రులు ఆశీర్వదించాలని కేటీఆర్ కు అధికారం పోయిన అహం తగ్గలేదని ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం పై కారు కూతలు కుస్తున్నాడు అని రాబోయే పట్ట బద్రుల ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెపుతారని మంత్రి సీతక్క గారు అన్నారు

తీన్మార్ మల్లన్న కామెంట్స్ మల్లన్న మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మల్యే అని, గతంలో ఎమ్మెల్సీగా దొంగ ఓట్ల గెలిచాడని ఆరోపించారు

ఆశీర్వదించండి.. అండగా ఉంటా.పట్టభద్రులు తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని, మీ ఓటును వృథా చేయకుండా ఎల్లప్పుడు అండగా ఉంటానని తీన్మార్‌‌ మల్లన్న పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పోతుందన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు లిస్ట్ ప్రకారం ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలన్నారు. బీఆర్‌‌ఎస్‌ ప్రచారం పెద్ద అమ్మలోళ్లు చేసినట్లు ఉన్నదని, వాళ్లను వాళ్లే కొట్టుకుంటున్నారని, ఇక బీజేపీ అభ్యర్థి ముసలాయన అని, ఆయన నల్గొండ పోయే వరకు ఎన్నికలు అయిపోతాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌‌ తనపై కావాలని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు. తనకు ఓటు వేస్తే ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పని చేస్తానని మల్లన్న పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ నియోజక వర్గ ఇంచార్జీ కూచన రవళి రెడ్డి,డాక్టర్ పులి అనీల్ తో పాటు రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking