పోలీస్ ల దాడిలో గాయ పడి న గిరిజన మహిళ ను పరామర్శించిన రెడ్ క్రాస్

హైదరాబాద్ ఆగష్టు 19 ();మన రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ గారి ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ మామిడి భీమ్ రెడ్డి ఆగస్టు 15 వ తేదీన రాత్రి డ్యూటీ లో వున్న పోలీస్ అధికారులు లక్ష్మి అనే మహిళ మీద ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్ర హింసలు పెట్టిన సంఘటన లో గాయపడిన గిరిజన మహిళ లక్ష్మి ని, కర్మ న్ ఘాట్ లో ని జీవన్ హాస్పిటల్ లో పరామర్శించారు. డాక్టర్లు లతో మాట్లాడి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఆమె కు పండ్లు, మందులు, రెడ్ క్రాస్ సామగ్రి ని అందించి మీకు అన్ని వేళ ల రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ అందుబాటులో వుంటుందని భరోసా ఇచ్చారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రెడ్ క్రాస్ వాలంటీర్లు దీక్షితులు, వెంకట్, గోపాల్ తదితరులు వెంట వెళ్లి పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking