ఎన్నికలలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం : జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మే 23:

ఎమ్మెల్సీ ఎన్నికలలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల నేపద్యం లో అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి,
ఆర్ డి ఓ సత్యపాల్ రెడ్డితో కలిసి సెక్టోరల్ అధికారులకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు పోలింగ్కు ఒక రోజు ముందే క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాల్లో వసతులను చూసుకోవాలన్నారు.
ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 26వ తేదీన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుందని, అదే రోజు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని మరుసటి రోజు పోలింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
సాధారణ ఎన్నికల మాదిరి మాక్ పోలింగ్ ఉండదని, పోలింగ్ ఎజెంట్ల సమక్షంలో పోలింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూపాలని, బాక్స్ మొత్తం ఖాళీగా ఉండాలని తెలిపారు. ఆ సమయంలో విడియో గ్రఫి చేసి తదుపరి పోలింగ్ బాక్సుని క్లోజ్ చేసి సీల్ వేయాలని, తర్వాత పోలింగ్ ను ప్రారంభించాలని అన్నారు. వయోవృద్ధులు, దివ్యాన్గుల సహాయార్థం పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. టెండర్, చాలెంజ్ ఓట్లు వేస్తే పిఓ ప్రత్యేక ఎన్వలప్ లో భద్రపరచాలని అట్టి వివరాలు పిఓ డైరీ లో నమోదు చేయాలని అన్నారు. ఓటర్ కు ఎడమ చేతి మధ్య వేలుకు ఇండిబుల్ ఇంకు పెట్టాలని అన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, తీసుకెళ్లేందుకు అనుమతి లేదని నిశిత పరిశీలన చేయాలని ఆయన సూచించారు.

పోస్టల్ బాలేట్ కు దరఖాస్తు చేస్కున్న, ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కలెక్టరేట్ లో ఎర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ లో
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొనుటకు శుక్రవారం 24 తేది చివరి రోజు అని అయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నోడల్అధికారి సివిల్ సప్లై మేనేజర్ బి రాంపతి, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, ములుగు తహసిల్దార్ విజయ భాస్కర్, ఎలక్షన్ డిప్యూటీ తాహసిల్దార్ విజయ్ కుమార్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking