జేడియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బూరగాపు రాజేశ్వరావు డిమాండ్
శ్రీకాకుళం మార్చ్ 29 : వైసీపీ ప్రభుత్వం నిరంకుశ నిర్ణయాలను విరమించుకోవాలని యునైటెడ్ జనతాదళ్ పార్టీ(జేడియు) శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బూరగాపు రాజేశ్వరావు డిమాండ్ చేశారు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాల్మీకి బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు నిజమైన గిరిజనులకు వారి హక్కులు,మనుగడపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే దళిత క్రిస్టియన్లను మోసం చేయడమేనని అన్నారు తద్వారా మతమార్పిడిలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. ఈ తీర్మానాలను వెంటనే ఉపసంహరించుకో కోవాలని డిమాండ్ చేశారు పార్టీ తరఫున అసెంబ్లీ ముట్టడికి చేస్తామన్నారు తమ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బీసీల అభ్యర్థులను నిలబెడతామని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల కోటేశ్వరరావు, పట్టణ మహిళా అధ్యక్షులు తోట మనీషా తదితరులు పాల్గొన్నారు