గ్యారెంటీ పథకాల అమలుపై అపోహలు వద్దు, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తాం. మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

మెదక్ 28-11-2023,
ప్రజా బలం న్యూస్ :-

 

గురువారం మెదక్ జిల్లా పాపన్నపెట్ మండలం లోని ఎల్లపూర్,మెదక్ పట్టణం లోని ఔరంగాబాద్ గ్రామ సభలో మెదక్ ఎమ్మెల్యే డా: మైనం పల్లి రోహిత్ రావు లో కలసి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజాపాలన గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని సంభందిత అధికారులు చదివి వినిపించారు.
ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రజా పాలన కార్యక్రమం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, గ్రామంలోని ప్రతి కుటుంబం వారి కుటుంబ పరిధిలో రావాల్సిన పథకాలకు దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
మెదక్ ఎమ్మెల్యే
డా: మైనం పల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కచ్చితంగా ప్రతి అర్హులైన వారికి పథకాలు అందిస్తామని, గ్రామ సభల ద్వారా నిజమైన అర్హులను ఎంపిక చేయడమే ప్రజా పాలన ఉద్దేశమన్నారు. మీ కుటుంబం లో వ్యక్తిగా మి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటూ మి కష్టాల్లో పలు పంచుకుంటామన్నరు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయని, ప్రజల అభివృద్ధిలో ఎలాంటి రాజకీయ పంథా అవసరం లేదన్నారు. అందరూ కలసి కట్టుగా ప్రజల అభివృద్దే ధ్యేయం గా పనిచేయాలన్నారు.గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన సభలో దరఖాస్తులు సమర్పించలేని వారు జనవరి 6 వరకు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని, గ్రామంలోని అర్హత గల ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు.

గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, పథకాల అమలుపై దళారులు, ఇతరులు చెప్పే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనవసరమైన అపోహలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యే అన్నారు.

6 గ్యారంటీలను బాధ్యతాయుతంగా అమలు చేయడం జరుగుతుందని, ఇప్పటికే ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి రెండు పధకాలను అమలు చేశామని, మిగతా పథకాలను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రజా పాలనా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్ లు లబ్ది దారులకు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ,అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ,ప్రజా ప్రతినిధులు ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking