పోరాడుతున్నానని పగబట్టారు..!

 

నా వార్డులోనే నన్ను బద్నాం చేస్తున్నారు

అధికారుల తీరు బాధాకరం

కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ ఆవేదన

జగిత్యాల, డిసెంబర్ 19: జగిత్యాల మునిసిపల్ లో పెరిగిన ఆవినీతి, అక్రమాలపై నిత్యం పోరాడుతున్నానని తెలిసి అధికారులందరు కుమ్మక్కై నా వార్డులోనే నన్ను బద్నాం చేసే ప్రయత్నాలకు తెరతీశారని జగిత్యాల మునిసిపల్ 35 వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని అనుమల్ల జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో గత నాలుగేండ్లుగా జగిత్యాల మునిసిపల్ లో జరుగుతున్న ప్రతి ప్రజావ్యతిరేక చర్యను వ్యతిరేకిస్తూ వస్తున్నాను. కొత్త జిల్లాలో పరిపాలన జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల చేతుల్లో ఉందని భావించి ఎన్నో ఫిర్యాదులు చేశానని వీటన్నిటిని మీడియాకు ఇస్తూ ప్రజల ముందుంచానని జయశ్రీ పేర్కొన్నారు. తన ఫిర్యాదులతో మింగుడుపడని పూరపాలకులు, అధికారులు, జిల్లాస్థాయి అధికారులు కొత్త ఎత్తుగడను తెరలేపారన్నారు. మునిసిపల్ పరిదిలో సక్రమ నిర్మాణమైనా వేళల్లో లంచాలు ఇవ్వనిదే నిర్మాణాలు పూర్తికావన్న విషయాన్ని స్థానిక ప్రజలే బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు. తనతో ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక నావార్డులో ఎవరైనా ఇంటి నిర్మాణం అనుమతి పొంది నిర్మాణ పనులు మొదలెడితే నేను ఫిర్యాదు చేసినట్లు ఇంటి యజమానికి నోటీసులు ఇస్తూ నా వార్డు ప్రజల ముందు నన్ను బద్నాం చేసే ప్రయత్నాలు మొదలెత్తరని అనుమల్ల జయశ్రీ అవేదనతో పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను 35 వ వార్డు ప్రజలు నమ్మవద్దని నన్ను వార్డు ప్రజల ముందు దోషిగా చిత్రీకరించి చర్యలకు పునుకొన్నారని ప్రజలు గుర్తించాలని జయశ్రీ కోరారు. నేను ఎప్పుడు వార్డు ప్రజల కోసమే పనిచేస్తానని జయశ్రీ పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ కుమారే మునిసిపల్ కు క్యాన్సర్ రోగం సోకిందని అన్న విషయం అందరికి తెలిసిందేనని జయశ్రీ పేర్కొన్నారు. గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని వెంటిలేటర్పై చేరిన మునిసిపల్ పై దృష్టి సారించి చర్యలు తీసుకొని పునర్ జీవము పోయాలని అనుమల్ల జయశ్రీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking