బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తిరుపతి

 

జగిత్యాల, ఆగస్టు 24: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పడాల తిరుపతిని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో బిజెపి బలోపేతానికి కృషిచేస్తున్న తిరుపతి సేవలు రాష్ట్ర పరిధిలో అవసరమని భావించిన రాష్ట్ర పార్టీ ఈ నియామకాన్ని చేపట్టినట్లు తిరుపతి పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన ఎంపీ అర్వింద్, జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావులకు ఈ సంధర్భంగా తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking