టీఎన్జీవోస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 23:
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి బ్రాంచ్ టీఎన్జీవోస్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకొన్నారు.
టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఈ కార్యవర్గ సమావేశంలో టీఎన్జీవోస్ ఎంజీఎం యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు.టీఎన్జీవోస్ ఎంజీఎం యూనిట్ అధ్యక్షులుగా బొమ్మగాని రవికుమార్, కార్యదర్శిగా కే రవీందర్, కోశాధికారిగా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఉపేందర్, సుధామణి, యాదగిరి, అశోక్ భాస్కర్, ఇజాజ్బేగం, సంయుక్త కార్యదర్శులుగా రాజయ్య, స్వరూప, లింగమూర్తి, రవీంద్రనాథ్, శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శిగా గోపి, కిషన్ నాయక్, అర్చన, సలీం, ప్రచార కార్యదర్శులుగా సుదర్శన్, ఉషారాణి, వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులుగా భరత్ ,భూషణ్, బిక్షపతి, పూర్ణచందర్ రెడ్డి, శ్రీనివాస్, రాంప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందంజలో ఉండాలని అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ సమస్యలు అన్నింటిని నూతన ప్రభుత్వం పరిష్కరించాలని ,నూతన ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. జిల్లా కార్యదర్శి గాదే వేణుగోపాల్ మాట్లాడుతూ ఎంజీఎం నూతన కార్యవర్గమునకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం బలోపేతానికి ప్రతి ఉద్యోగి సంఘటితంగా పనిచేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం ఉపాధ్యక్షులు గద్దల రాజు యాకమ్మ సంయుక్త కార్యదర్శి శ్రీ జ్యోతి నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రమీలావతి తిరుమల సిటీ అధ్యక్షులు వెలిశాల రాజు జిల్లా నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం బాధ్యులు మల్లేశం శ్రీకాంత్ బిక్షపతి అజయ్ ఎంజీఎం ఉద్యోగులు మధు శ్రీకళ సత్యనారాయణ భరత్ చిరంజీవి తదితర ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking